
VisakhaEducation, FlashMail News : ఆంధ్రవిశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ లో శనివారం ఉదయం పూర్వవిద్యార్థుల సమావేశంలో జరిగింది. విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ 2025 నిర్వహించిన నేపథ్యంలో ఆంధ్రాయూనివర్శిటి పూర్వ విద్యార్థులు వివిధ కళాశాలలకు వ్యాయామ విద్యా టీచర్లుగా 40 మంది విద్యార్థులు కు పైగా ఎంపికయ్యారన్నారు. ఈ విభాగంలో ఉన్న పరిశోధకులు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే తెలగాణా రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సీ లో కూడా ఇద్దరు విద్యార్థులు పి.ఈ.టీలు గా నియామకం అయ్యారని ఈసందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన పూర్వ విద్యార్థులు అందరికీ అభినందన తెలిపారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేవ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ నిర్వహించడం ప్రశంసనీయం మని ఈ శతాబ్ది ఉత్సవాలు ఏయూ కన్వన్సెన్ సెంటర్ లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న నేపపధ్యంలో ముఖ్యఅతిధిగా రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి హాజరవుతారని విద్యార్థులు అందరూ హాజరు కావాలన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీ.పీ రాజశేఖర్ సూచనలు మేరకు ఆంధ్రాయూనివర్శిటిలో ఇంటర్ కాలిజియట్ పురుషులు మహిళలు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులు అందరికీ భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. శతాబ్ది ఉత్సవాలు, పురష్కరించుకుని క్రికెట్ పోటీలు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగిందని ఈ పోటీలు పాల్గొనే విద్యార్థులకు పరీక్షల నేపధ్యంలో వాయిదా వేసామని త్వరలో ఈపోటీలు నిర్వహించనున్నామన్నారు. ఈపోటీల విజేతలకు గ్రాండ్ ప్రైజ్ మనీ ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పరిశోధకు లు, ఎంపీఈడీ విద్యార్థులు పాల్గొన్నారు.
