ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంటర్ కాలిజియట్ బాల్ బాట్మింటెన్ విజేత మిసెన్ ఎవిఎన్ కళాశాల

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 15 : ఆంధ్రవిశ్వవిద్యాలయం బాల్ బ్యాట్మింటెన్ ఇంటర్ కాలిజియట్ కమ్ యూనివర్శిటి ఎంపిక ఏయూ టెన్నిస్ ప్రాంగణంలో సోమవారం జరిగింది. ఈపోటీల విజేతలను ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ ఆచార్య ఎ. నర్శింహారావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపల్ ఆచార్య ఎ. నర్శింహారావు బహుమతి ప్రధానం చేసారు. ప్రధమ స్థానంలో మిసెస్ ఏవిఎన్ కళాశాల, ద్వితీయ స్థానంలో జి.వి.పి గాయత్రి కళాశాల మూడవ స్థానంలో అళ్వర్ దాస్ డిగ్రీ కళాశాల విజేత లగా నీలిచారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాయూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఈ ఏడాది క్రీడలు వర్సిటీలో జరగడం అభినందనీయంని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న క్రీడా రిజర్వేషన్ విని యోగించు కోవాలంటే క్రీడల్లో ప్రతిభా వంతులుగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యు కేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, ఎవిఎన్ కళాశాల పిడి డాక్టర్ గోపికృష్ణ, గాయత్రి కళాశాల పిడీ కిశోర్, అళ్వార్ దాస్ , వ్యాయామ విద్యా పిడి లు రాజేష్,ఐ ఐ ఏం స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, చిన్నారావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *