ప్రతీ విద్యార్థి ఏదోక క్రీడలో పాల్గొనాలి

క్రీడలు


విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 17 : ప్రతి విద్యార్థి ఏదొక క్రీడలో పాల్గోనాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే రామనాయుడు అనారు. ఏయూ హాకీ పురుషులు ఇంటర్ కాలిజియట్ పోటీలు ముగిసిన సందర్భంగా ఆయన ముఖ్యఅతిధిగా హాజరై క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేసారు. హాకీ పురుషులు విభాగంలో విన్నర్స్ అనకాపల్లి జిల్లా యలమంచిలి పూర్ణసాయి డిగ్రీ కాలేజ్ నిల్చింది. ద్వితీయ స్థానంలో విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల, తృతీయ స్థానంలో యలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నిల్చింది. ఈసందర్భంగా క్రీడాకారులను బహుమతి ప్రధానం చేసారు. అనంతరం మాట్లాడుతూ సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్శిటికి వెల్లే మహిళల హాకీ జట్టును అభినందించారు. ఏయూ డైక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్స్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ ఏయూ వ్యాయామ విద్యా క్రీడా మైధానంలో పురుషుల ఇంటర్ కాలిజియట్, మహిళల యూనివర్శిటి ఎంపిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, వివిధ కళాశాలకు చెందిన క్రీడాకారులు పలుగున్నరన్నారు. ఈ ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసామన్నారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి మాట్లాడుతూ ఏయూ లో ఇంటర్ కాలిజియట్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ సూచనలు మేరకు ఏర్పాట్లు చేసామన్నారు. ఈసందర్భంగా వీసీ రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏయూ సెక్యూరీటీ డీన్ ఆచార్య ఆషా ఇమ్మానియల్ రాజ్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పిడీ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి, ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ దిలీప్ కుమార్, ఉదయ్,నక్కపల్లి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పి.డీ కె. దుర్గారావు, యలమంచిలి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సతీష్, తోపాటు వివిధ కళాశాల ఫిజికల్ డైర్టెర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *