గీతం వేధికగా ‘‘లాసా’’ 13వ అంతర్జాతీయ సమావేశాలు

ఎడ్యుకేషన్


visakhapatnam, November 29: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వేధికగా డిసెంబర్‌ 19 నుంచి 20వ తేదీ వరకు లేబొరేటరీ ఎనిమల్‌ సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (లాసా) 13వ అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు లాసా జాతీయ అధ్యక్షుడు, సిఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయపాల్‌సింగ్‌ వెల్లడిరచారు. దీనికి సంబంధించిన వివరాలను నవంబర్ 29 న గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలియజేశారు. లాసా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జె.మహేష్‌కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.కె.శక్తి దేవన్‌, సమావేశాల కమిటి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.శ్రీనివాస్‌ నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ జి.సుహసిన్‌, కన్వీనంల్‌లు డాక్టర్‌ నేమాని హరిశంకర్‌, డాక్టర్‌ నితిన్‌ యాదవ్‌ సమక్షంలో అంతర్జాతీయ సమావేశాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔషధ పరిశోధనలలో భాగంగా శాస్త్రవేత్తలు జంతువులపై జరిపే పరిశోధనలకు సంబంధించి దేశంలో లేబొరేటరీ ఎనిమల్‌ సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (లాసా) క్రియాశీల పాత్రపోషిస్తోందని, ప్రస్తుతం దేశంలో దాదాపు 1300 మంది శాస్త్రవేత్తలు లాసాలో జీవిత సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లాసా వార్షిక సదస్సులను, సమావేశాలను నిర్వహిస్తోందని, ఇందులో వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొని నూతనంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక అంశాల పై చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 19`20 తేదీలలో గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ తో సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సమావేశాలకు దేశ విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా, యుకె, సింగపూర్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి జంతు శాస్త్రవేత్తలు, ఔషధరంగ నిపుణులు, వెటర్నరీ సైన్స్‌ పరిశోధకలు మరియు దేశంలోని కేంధ్ర పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు మొత్తం 600 మందికి పైగా ప్రతినిధులు, 100 వలంటీర్లు పాల్గొనున్నారని వారు తెలిపారు. ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ సదస్సు యొక్క థీమ్‌ ‘‘డ్రగ్‌ డిస్కవరీ మరియు ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చిలో జంతు అద్యయనాల నుండి ఫర్‌ క్లీనికల్‌ అంతర్టృష్టులు అని తెలిపారు. ఈ సమావేశాల ద్వారా ఔషధ పరిశోధనలలో ఉపయోగించే జంతువుల ఆరోగ్యం, సంక్షేమం, నైతికత మరియు నియంత్రణ అంశాలు వంటి ముఖ్య విషయాలను ప్రయోగాత్మక లాబొరేటరీ ఎనిమల్‌ సైన్స్‌లో తాజా మరియు ఆధునిక అభివృద్దులను చర్చించనున్నారు. అదేవిధంగా ముందస్తుగా డిసెంబర్‌ 18న మూడు కాన్‌ఫరెన్స్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామన్నారు. ప్రీక్లినికల్‌, రెగ్యులేటరీ మరియు ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చి రంగాలలో పని చేస్తున్న లాసా సభ్యులు, ప్రముఖ నిపుణులు, పరిశోధకులకు తమ ఆవిష్కరణాత్మక అన్వేషించేందుకు మరియు డ్రగ్‌ డిస్కవరీ, డెవలప్‌మెంట్‌ కీలకమైన, అర్ధవంతమైన చర్చలు జరపడానికి, పరిశోధిక విద్యార్ధులు, పి.జి.విద్యార్ధులు పాల్గొని సందేహలను నివృత్తి చేసుకోవడానికి ఈ సమావేశాలు వేధికగా ఉపయోగపడతాయన్నారు. జంతువుల రవాణాలో ఇబ్బందులు తొలగించాలి : ఔషధ ప్రయోగాలకు ఉపయోగించే జంతువుల రవాణాలో ముఖ్యంగా విమానాల ద్వారా జంతువులను రవాణా చేయడంలో కొత్త నిబంధనలు అవరోధంగా ఉన్నాయని, రహదారి మార్గం పై ఆధారం పడటంతో ప్రయోగశాలలకు చేరేలోగా జంతువులు మరణిస్తున్నాయని ప్రభుత్వం చొరవ చూపి గతంలో మాదిరి విమానాల ద్వారా జంతువుల రవాణాను పునరుధ్దరించాలని లాసా జాతీయ అధ్యక్షుడు, సిఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయపాల్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *