పాత్రికేయులకు ఏఐ శిక్షణ తరగతులు సర్టిఫికేట్స్ ప్రధానం చేసిన డాక్టర్ ఎల్. బి. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి. మధుకుమార్

Uncategorized

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 17 : డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్ తరగతి గదిలో పాత్రికేయుల ప్రతినిధులు కు స్టాఫ్ రిపోర్టర్లకు, జర్నలిజం విద్యార్థులకు ఏఐ శిక్షణా తరగతులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అందించారు. రేషోర్స్ ఎడిటర్ ఇన్వెస్టిగేషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సర్టిఫైడ్ ఎడిఐఆర్ఎ ట్రైనర్ అందించారు. ఈసందర్భంగా ఎడిటర్ రిసోర్స్ పర్సన్ గా సుధాకర్ రెడ్డి ఉడుముల పాఠ్యాంశంలో భాగంగా ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగాలు, న్యూస్ ఎడిటింగ్, ఏఐ టెక్నాలజితో వీడియో ఎడిటింగ్, న్యూస్ సేకరణ, వెబ్సైట్ ల ద్వారా న్యూస్ సేకరణ, జెమిని, గోగుల్ వంటి మీడియా సాధనాలు వాటి ఉపయోగాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా 50 మందికి పైగా తరగదులుకు హాజరవ్వగా సర్టిఫికేట్లు ప్రధానం చేసారు. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జి. మధుకుమార్ సూర్య దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ సత్యనారాయణకు కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపెయన్సీస్ సర్టిఫికేట్ ను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సదస్సు లో. శిక్షణ అందించి న
ఎడిటర్ ఇన్వెస్టిగేషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, సర్టిఫైడ్ ఎడిఐఆర్ఎ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి ఎస్ కె చక్రవర్తి తదితరులు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *